Ticket Cancellation : కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ( Corona Pandemic )  ఆగస్ట్ 12 వరకు అన్ని రెగ్యులర్ రైళ్లను రద్దు చేస్తున్నట్టు ఇటీవలే భారతీయ రైల్వే ( Indian Railways ) ప్రకటించింది. ఇలాంటి సమయంలో  ముందే బుక్ చేసుకున్న టికెట్ల పరిస్థితి ఏంటి అని.. ఆ డబ్బు పరిస్థితి  ఏంటి అని చాలా మంది ప్రయాణికులు దిగులుపడుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నిజానికి ఈ రైళ్లను ఇండియన్ రైల్వే ( IRCTC ) రద్దు చేసింది.  కాబట్టి..ఆ టికెట్లు ఆటోమెటిక్ గా రద్దు అవుతాయి. అనంతరం డబ్బు రీఫండ్ (Railway Refund ) కూడా అవుతుంది. అయితే  భవిష్యత్తులో మీరు బుక్ చేసుకున్న టికెట్ను మీరు రద్దు చేసుకోవాలి  అనుకుంటే మాత్రం మీరు చేయాల్సిందల్లా ఒక్క ఫోన్ కాల్ మాత్రమే.  Also Read : PM Modi quits Weibo: చైనాకు పీఎం మోడీ మరో ఝలక్


ఈ ఆప్షన్ గురించి  చాలా మందికి తెలియదు. కానీ కౌంటర్ నుంచి కొన్ని టికెట్లను ఒకే ఒక్క ఫోన్ కాల్ తో రద్దు చేసుకుని రీఫండ్ పొందవచ్చు. దీని కోసం వినియోగదారులు ముందు 139 నెంబర్ కు  కాల్ చేయాల్సి ఉంటుంది. మీరు ఏదైనా టికెట్ బుక్ చేసి ఉంటే  అప్పుడు మీ పీఎన్ఆర్ (PNR Number ) సంఖ్యను అక్కడ ఏజెంట్కు తెలపాల్సి ఉంటుంది.  దీని తరువాత మీకు ఒక ఓటీపి ( One Time Password )  వస్తుంది.  దాన్నిమీరు ఏజెంట్ కు తెలియజేయాలి.  అప్పుడు వెంటనే మీ టికెట్ క్యాన్సిల్ అవుతుంది. ఈ  విధానం వల్ల మీరు ఎక్కడినుంచైనా టికెట్ రద్దు చేసుకోవచ్చు. Also Read : China Dispute: భారత్ తోనే కాదు..18 దేశాలతో చైనాకు వివాదం